భారతదేశం, మార్చి 3 -- మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గతేడాది దేవర చిత్రంతో మంచి హిట్ కొట్టారు. యాక్షన్‍తో మరోసారి అదరగొట్టేశారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఎన్టీఆర్ స్టార్‌డమ్‍తో రూ.500కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్‍లో హృతిక్ రోషన్‍తో కలిసి వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీపై చాలా హైప్ ఉంది. హైవోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అయిన నీల్‍తో తారక్ సినిమా చేస్తుండటంతో ఆసక్తి చాలా ఉంది. తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత మాట్లాడారు.

భారతీయ చిత్రాల్లో ఇప్పటి వరకు రానటువంటి కథతో ఎన్టీఆర్, నీల్ చిత్రం ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ అన్నారు. ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీని తెలుగులో రిలీజ్ చేసింది మైత్ర...