భారతదేశం, ఫిబ్రవరి 21 -- Ntr Prashanth Neel Movie: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో ఓ భారీ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. గురువారం హైద‌రాబాద్‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ ప్రారంభ‌మైంది. దాదాపు మూడువేల మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌పై కీల‌క‌మైన సీన్స్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్నాడు. ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ జ‌రుగుతోంది. మార్చి నెలాఖ‌రు నుంచి ఆరంభ‌మ‌య్యే త‌దుప‌రి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం.

కాగా ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. పీరియాడిక‌ల్ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు చెబుతోన్నారు. లేటెస్ట్ షెడ్యూల్ కోసం అల‌నాటి కోల్‌క‌తా సిటీని త‌ల‌పించేలా భారీ సెట్స్ ...