భారతదేశం, ఏప్రిల్ 15 -- మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో మూవీ చేయనున్నారు. బాలీవుడ్ సినిమా వార్ 2 షూటింగ్ రీసెంట్‍గానే పూర్తి చేసుకున్నారు. తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఓ చిత్రాన్ని ఎన్టీఆర్ ఓకే చెప్పారు. దేవర 2 సినిమా కూడా చేయాల్సి ఉంది. దీంతో ఆ రెండు సినిమాల్లో ఎన్టీఆర్ ముందు ఏది చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఎన్టీఆర్ సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ తాజాగా క్లారిటీ ఇచ్చేశారు.

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఈ వారం ఏప్రిల్ 18న విడుదల కానుంది. దీంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కల్యాణ్. ఈ క్రమంలో ఎన్టీఆర్ లైనప్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్వూలో మాట్లాడారు. ఏ చిత్రం ముందో వెల్లడించారు.

డైరెక్టర్ ప్రశాంత్ నీత్‍తో సినిమాను ముందుగా ఎన్టీఆర్ పూర్తి చేస్తారని కల్యాణ్ రామ్ త...