భారతదేశం, జనవరి 22 -- వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో 'రిమోట్ కమాండ్ కంట్రోల్'ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో జరిగే యూజీ, పీజీ మెడికల్ వార్షిక/సప్లిమెంటరీ పరీక్షల తీరును సీసీ కెమెరాల ద్వారా ఈ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తారు. దీనివల్ల కాపీయింగ్ వంటి ఘటనలకు అవకాశం ఉండదని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గతానుభవాల దృష్ట్యా వైద్య విద్య పరీక్షల్లో కాపీయింగ్ నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని పరీక్షలు జరిగే గదుల్లో ఉండే సీసీ కెమెరాలకు విశ్వవిద్యాలయంలోని రిమోట్ కమాండ్ కంట్రోలు రూముకు అనుసంధానం చేసినట్లు ...