భారతదేశం, ఏప్రిల్ 11 -- ఎన్టీఆర్ జిల్లా పెన‌మ‌లూరు మండ‌లంలోని య‌న‌మ‌ల‌కుదురు గ్రామంలో విషాదం జరిగింది. తండ్రీకుమారులు మృతిచెందారు. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. య‌న‌మ‌ల‌కుదురులోని వినోద్ ప‌బ్లిక్ స్కూల్ రోడ్డులో ఒక అపార్ట్‌మెంట్‌లో వేమిరెడ్డి సాయిప్ర‌కాష్ రెడ్డి (33), అతని భార్య లక్ష్మీ భ‌వాని, ఇద్ద‌రు పిల్ల‌లు త‌క్షిత (కుమార్తె), ఏడేళ్ల త‌క్షిత్ (కుమారుడు) ఉన్నారు. సాయిప్ర‌కాష్ రెడ్డి విజ‌య‌వాడంలోని వ‌న్‌టౌన్‌లో బంగారు ఆభ‌ర‌ణాల త‌యారీ వ్యాపారం చేస్తుంటారు. భార్య ల‌క్ష్మీ భ‌వాని గాంధీన‌గ‌ర్‌లోని జ‌న ఔష‌ధి మెడిక‌ల్ షాపులోని ప‌ని చేస్తోంది.

క‌రోనా స‌మయంలో వ్యాపారం స‌రిగా లేక‌పోవ‌డంతో తీవ్రంగా న‌ష్ట‌పోయారు. సాయి ప్ర‌కాష్ రెడ్డి అప్ప‌లు చేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయాడు. కొన్ని అప్పులు కుటుంబ స‌భ్యులు తీర్చిన‌ప్ప‌టిక...