భారతదేశం, ఫిబ్రవరి 10 -- NTR District Crime: ఎన్‌టీఆర్ జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. కంచికచర్లలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై ప్రేమికుడి స్నేహితుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆ త‌రువాత మరో ఇద్ద‌రు ఆమెను కోరిక తీర్చాలని వేధిస్తూ వ‌చ్చారు. వారి వేధింపులు తాళ‌లేక యువ‌తి జ‌రిగిన విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. వారి ఫిర్యాదుతో ముగ్గురు నిందితుల‌పై కేసు న‌మోదు చేసి, వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘ‌ట‌న ఎన్‌టీఆర్ జిల్లా కంచిక‌చ‌ర్ల మండ‌లంలోని ప‌రిటాల‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా బ‌య‌ట‌ప‌డింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తిరువూరుకు చెందిన యువ‌తి (19) ఇంజినీరింగ్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతూ హాస్ట‌ల్‌లో ఉంటుంది. కంచిక‌చ‌ర్ల మండ‌లం ప‌రిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) ఇంజ‌నీరింగ్ విద్యార్థినిని ప్రేమ ...