భారతదేశం, మార్చి 5 -- NTR District Crime: మాయ మాటలతో పెళ్లి చేసుకుని ఆ తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను వేధిస్తున్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలోని చంద‌మామ పేట‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం చంద‌మామ పేట‌కు చెందిన ఎస్‌.కె. న‌జియాబేగంతో తెలంగాణ రాష్ట్రం ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం మండ‌లం భీమ‌వ‌రం గ్రామానికి చెందిన షేక్ యాసిన్‌తో ఏడాది క్రిత‌మే వివాహం అయింది.

షేక్ యాసిన్ హైద‌రాబాద్‌లో హోట‌ల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగం చేస్తున్న‌ట్లు న‌మ్మించి వివాహం చేసుకున్నాడు. పెళ్లి జ‌రిగిన‌ప్పుడు న‌జియాబేగం త‌ల్లిదండ్రులు కట్నంగా రూ.5 ల‌క్ష‌ల న‌గ‌దు, ప‌ది స‌వ‌ర్ల బంగారం, రెండు ల‌క్ష‌ల విలువ చేసే సామాన్లు ఇచ్చారు.

పెళ్లి అయిన త‌రువాత రెండు నెల‌ల పాటు షేక్ యాసిన్ స్వ‌స్థ‌లం భీమ‌వ‌రంలోనే...