భారతదేశం, ఫిబ్రవరి 28 -- రాష్ట్రంలో ప్ర‌తినెల ఒక‌టో తేదీన పెన్ష‌న్ల పంపిణీ కొన‌సాగుతోంది. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ప్రారంభ‌మైన ఒకటో తేదీన పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని.. ఆ త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం కూడా కొన‌సాగిస్తూ వ‌స్తోంది. అయితే గ‌త ప్ర‌భుత్వం హ‌యంలో వాలంటీర్లు పంపిణీ చేసేవారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత వాలంటీర్లను తొల‌గించింది. స‌చివాల‌య ఉద్యోగులు, కూట‌మి పార్టీల నేత‌లు పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం 63,34,732 మంది వృద్ధాప్య‌, వితంతు, దివ్యాంగ, దీర్ఘ‌కాలిక వ్యాధుల పెన్ష‌న‌ర్లు ఉన్నారు. వీరులో మొత్తం 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘ‌కాలిక వ్యాధుల పెన్ష‌న్లను పొందుతున్నారు. వీరిలో దివ్యాంగ పెన్ష‌న‌ర్లు 7,87,976 మంది కాగా.. దీర్ఘ‌కాలిక వ్యాధుల పెన్ష‌న‌ర్లు 30,924 మంది ఉన్నారు. మిగ...