భారతదేశం, ఏప్రిల్ 9 -- ప్ర‌శాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ ఎప్పుడు జాయిన్ అవుతాడా అని ఎదురుచూస్తున్న అభిమానుల‌కు మేక‌ర్స్ బుధ‌వారం గుడ్‌న్యూస్ వినిపించారు.ఏప్రిల్ 22 నుంచి ఈ మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొన‌నున్న‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ చేసిన ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మొద‌లైంది. ఎన్టీఆర్ లేకుండా సినిమాలో వ‌చ్చే కొన్ని కీల‌క‌మైన ఎపిసోడ్స్‌ను హైద‌రాబాద్‌లో ప్ర‌శాంత్ నీల్ షూట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ బ‌ళ్లారి ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు డ్రాగ‌న్ అనే టైట...