భారతదేశం, మార్చి 25 -- NRI Suicide: అమెరికాలో కృష‌్ణా జిల్లా గుడివాడకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్డడ్డాడు. ఉద్యోగంలో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గుడివాడ మండలం దొండపాడు గ్రామానికి చెందిన కొల్లి శ్రీనివాసరావు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉపాధి కోసం గుడివాడ రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నారు.

శ్రీనివాసరావుకు కవల పిల్లలు అభిషేక్, అరవింద్‌ ఉన్నారు. వీరిద్దరు ఉన్నత చదువులు చదివుకున్నారు. అభిషేక్‌ ఇంజనీరింగ్‌ పూర్తైన తర్వాత పదేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అభిషేక్‌ ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్‌‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది క్రితం అభిషేక్‌కు అమెరికాలోనే ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం భార్యతో కలిసి అభిషేక్ ఫీనిక్స్‌లోనే ఉంటున్నారు. సోదరుడు అరవింద్‌ కూడా అమెరికాలోనే ఉంటున్నారు.

సరైన ఉద్యోగం లేక...