భారతదేశం, మార్చి 28 -- టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ రికార్డు నమోదు చేశాడు. హిస్టరీ క్రియేట్ చేశాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో సెమీస్ చేరిన ఓల్డెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. 37 ఏళ్ల ఈ సెర్బియా ఆటగాడు అతిపెద్ద వయస్సు ఆటగాడిగా రికార్డు అందుకున్నాడు. తాజాగా మియామి ఓపెన్ లో జకోవిచ్ సెమీఫైనల్ చేరాడు. క్వార్టర్స్ లో సెబాస్టియన్ కోర్డాపై విజయం సాధించాడు.

37 ఏళ్ల 10 నెలల వయసులో జకోవిచ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో ఫెదరర్ (37 నెలల 7 నెలలు) రికార్డును బ్రేక్ చేశాడు.

మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో నొవాక్ జకోవిచ్ దూసుకెళ్తున్నాడు. క్వార్టర్స్ లో జకోవిచ్ 6-3, 7-6 (7/4)తో అమెరికాకు చెందిన సెబాస్టియన్ కోర్డాపై గెలిచాడు. ఈ విజయంతో మాస్టర్స్ 1000 టోర్నీలో సెమీఫైనల్ కు చేరిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు.

37 ఏళ్ల సెర్బియా ఆటగాడు జకోవిచ్.. కోర్డాప...