భారతదేశం, ఫిబ్రవరి 20 -- Nothing Phone 3a: నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ తేదీని మార్చి 4గా నిర్ణయించారు. ఈ కొత్త సిరీస్ లైనప్ లో రెండు మోడళ్లు ఉన్నాయి. అవి నథింగ్ ఫోన్ 3ఏ, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో. ఇందులో ఈ సారి నథింగ్ ఫోన్ 3ఏ ప్లస్ మోడల్ లేదు. ప్లస్ సిరీస్ ను విడిగా కొనసాగిస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి.

నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్ గురించి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న సమాచారంలో ఎక్కువ భాగం లీకులు, పుకార్ల నుంచే వస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. ఫ్రెంచ్ పబ్లికేషన్ డీలాబ్స్ నుండి వచ్చిన తాజానివేదికల ప్రకారం, కొత్త ఫోన్ల ధరను అనేక యూరోపియన్ ప్రాంతాలకు వెల్లడించారు. బేస్ మోడల్ ధర స్వల్పంగా పెరిగే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభించే బేస్ మోడల్ అయిన...