భారతదేశం, జనవరి 28 -- Nothing Phone: లండన్ కు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ తన లేటెస్ట్ డివైజ్ ను మార్చి 4న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, కంపెనీ తాము లాంచ్ చేయనున్న మోడల్ ఏంటి అనే విషయాన్ని మాత్రం రహస్యంగానే ఉంచింది. దాంతో ఇది అనేక ఊహాగానాలకు దారితీసింది.

నథింగ్ ఫోన్ (2) 2023 జూలైలో లాంచ్ అయింది. ఆ తరువాత రాబోయే మోడల్ నథింగ్ ఫోన్ (3) అవుతుందని, అందువల్ల మార్చి4వ తేదీన నథింగ్ సంస్థ లాంచ్ చేయబోయే స్మార్ట్ ఫోన్ నథింగ్ 3 అని భావిస్తున్నారు. అయితే, ఈ అంచనా తప్పని, ఈ సారి నథింగ్ ఫోన్ తన బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ అయిన నథింగ్ ఫోన్ (3ఏ)ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే, మార్చి 4వ తేదీన నథింగ్ సంస్థ లాంచ్ చేయబోయే మోడల్ ఏమిటో ఫ్లిప్ కార్ట్ బయటపెట్టేసింది. అది నథింగ్ ఫోన్ (3ఎ) అని వెల్లడించింది. నథింగ్ ఫోన్ 3ఎ (Nothing P...