భారతదేశం, ఏప్రిల్ 11 -- దేశంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలో ఓవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, మరోవైపు ఆకస్మిక వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​లో ఇటీవల కురుసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 47మంది మరణించారు.

బిహార్​లోని పలు జిల్లాల్లో పిడుగులు, వడగళ్ల వానలకు 25 మంది మృతి చెందారు. నలందలో 18 మంది, సివాన్​లో ఇద్దరు, కతిహార్, దర్భంగా, బెగుసరాయ్, భాగల్పూర్, జెహనాబాద్లలో ఒక్కొక్కరు మరణించినట్లు బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

బిహార్​లోని నాలుగు జిల్లాల్లో బుధవారం పిడుగుపాటుకు 13 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రూ.4 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ రాష్...