Hyderabad, ఫిబ్రవరి 24 -- వేసవి కాలం నాన్ వెజ్ తినొచ్చా.. అనే అనుమానం మీకూ ఉందా? ఎందుకంటే, సమ్మర్‌లో సరిగా అన్నం తినాలనిపించదు. సాధ్యమైనంత వరకూ జ్యూస్ లు, మంచినీళ్లతోనే కడుపు నిండిపోతుంది. ఒకవేళ తినాలనుకుంటే, కచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. అలా ప్రతిసారీ మాంసాహారం తింటే ప్రమాదకరం కాదా? ఒకవేళ తినాలనుకుంటే, మనకు అందుబాటులో ఉండే చికెన్, మటన్, చేపలలో ఏది తినడం బెటర్?

వేసవిలో శరీరం సహజంగా వేడిగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి తగ్గిపోతుంది. సాధారణంగానే నాన్-వెజ్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, వేసవిలో నాన్ వెజ్ తినడం, అరిగించుకోవడం కొంత కష్టమే. వీలైనంత వరకూ మాంసాహారాన్ని తగ్గించడమే మంచిది.

మాంసాహారం వంటకాల్లో చికెన్, మటన్, చేపలు ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలు, హానికారకాలు కలిగి ఉంటాయి. కాబట్టి పరిస్థితిని బట్టి ఐటెంను ఎంచుకోవడం ఉత్...