Hyderabad, మార్చి 12 -- స్మోకింగ్‌కు బానిసలుగా మారుతున్నవారి సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతోంది. ధూమపానం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ అలవాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీస్తుంది. దాని వల్ల కలిగే అనర్థాలు తెలిసినా కొందరు దాన్ని మానలేకపోతున్నారు. సిగరెట్లు మానేయడం లేదా తగ్గించడం అనేది కష్టమైన పనే కానీ అసాధ్యం మాత్రం కాదు.

ప్రతి సంవత్సరం మార్చి రెండవ బుధవారం నో స్మోకింగ్ డే నిర్వహించుకుంటాం. ధూమపానం మానేయాలనుకునేవారికి సహాయపడటానికి ఈ రోజును ఆరోగ్య అవగాహన దినోత్సవంగా చేస్తారు. ధూమపానం మానేయడానికి మీకు సహాయపడే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

మీరు ధూమపానం మానేయాలనుకుంటే, ఎందుకో మానేయాలనుకుంటున్నారో ముందుగా మనసులో గట్టిగా అనుకోండి. బలమైన కారణం ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది.

కుటుం...