భారతదేశం, మార్చి 2 -- రాత్రుళ్లు భోజనం చేయకుండా పడుకోవడం బరువు తగ్గడానికి చేసే మార్గాల్లో ప్రభావవంతమైనదిగా భావిస్తుంటారు. మరికొందరి వాదన ప్రకారం, డిన్నర్ చేయకపోవడం అంటే, ఉపవాసంతో పడుకోకుండా ఎంతో కొంత తినాలని చెబుతుంటారు. వీటిల్లో ఏది కరెక్ట్? ఎలా ఉంటే, (తింటే) త్వరగా బరువు తగ్గుతామనే గందరగోళం చాలా మందిలో ఉండేదే. వాస్తవానికి ఇలా చేయడం వల్ల శరీరంలోకి కేలరీలు చేరే శాతం తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గేందుకు ఓ మోస్తారు ప్రయోజనం ఉంది. కానీ, ఇది అందరికీ కాదు. కొందరిలో ఈ పద్దతి సమస్యలను తెచ్చిపెడుతుంది.

రాత్రి భోజనం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఎవరెవరు దీన్ని పాటించాలి? ఎవరెవరు పాటించకూడదు? తెలుసుకుందాం రండి.

మీరు రోజూ తీసుకునే దానికంటే తక్కువ కేలరీలను శరీరంలోకి పంపినప్పుడు బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. రాత్రి సమయంలో ఎక్కువ పని చేయరు. కాబ...