Hyderabad, జనవరి 30 -- Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 30th January Episode)లో చిత్రగుప్తుడి పొరపాటు వల్ల జరిగిన తప్పు అరుంధతికి తెలియకూడదని తనని పక్కకు తీసుకెళ్లమని చెప్తాడు యముడు. దాంతో అరుంధతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు గుప్త.

వాళ్లు వెళ్లిపోయాక మనం చేసిన తప్పిదం ఆ బాలికకు తెలిస్తే ఇంకేమైనా ఉన్నదా అని భయపడతాడు యముడు. దీంతో చిత్రగుప్తుడు పాపుల చిట్టా నా దగ్గరే ఉంది కదా..? అందులో ఆ బాలిక నాలుగు తప్పిదములు చేసిందని రాస్తాను అంటాడు. యముడు కోపంగా ఆ బాలిక ఈ విషయం పసిగడితే మన పరిస్థితి ఏంటి. ఇదే నరకంలో మనం కూడా శిక్ష అనుభవించాలి అంటాడు యముడు.

మరి ఇప్పుడేం చేయాలని చిత్రగుప్తుడు అడిగితే ఆ బాలిక గురించి పూర్తిగా తెలిసిన చిత్ర విచిత్రగుప్తుడినే అడుగుదాం అని పిలుస్తారు. గుప్త రాగానే యముడు...