భారతదేశం, జనవరి 29 -- యముడిని కలవాలనుకున్న ఆరు గంట కొడుతుంది. యముడు వచ్చి కోపంగా ఎందుకు పిలిచావు బాలిక అంటాడు. దాంతో ఆరు భయపడుతుంది. దగ్గరకు వెళ్లి మిమ్మల్ని డిస్టర్బ్‌ చేసినందుకు సారీ కానీ తప్పక అలా చేయాల్సి వచ్చింది. వెంటనే నేను కిందకు వెళ్లాలి అని చెప్తుంది. సూర్యాస్తమయం ముగిసిన పిమ్మట ఇచ్చట ఏ కార్యములు చేయమని.. అన్ని ద్వారములు మూసివేయబడతావని ఈ బాలికకు చెప్పలేదా..? అని అడుగుతాడు యముడు.

చెప్పాము ప్రభు.. కానీ మా మాట వినడం లేదు అంటాడు గుప్త. యముడు కోపంగా విచిత్ర గుప్త ఈ బాలికను ఆమె స్థావరం దగ్గర విడిచిపెట్టుము అంటాడు. సరేనని గుప్త తీసుకెళ్తాడు. ఆరు వెళ్లిపోయాక ఆ బాలికకు తన మరణం విషయంలో నిజం తెలిస్తే ముల్లోకాలు తిరిగైనా మనల్ని ఇబ్బంది పెడుతుంది అని చర్చించుకుంటారు యముడు, చిత్రగుప్తుడు.

రణవీర్‌, అమర్‌ ఇంటికి వస్తాడు. రణవీర్‌ను చూసి అంజు ప...