Hyderabad, ఫిబ్రవరి 8 -- Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 8th February Episode)లో కాళీ జైలు నుంచి అమర్‌ ఇంటికి వచ్చి గట్టిగా పిలుస్తుంటే రాథోడ్‌ అడ్డుపడతాడు. నువ్వు జరుగు అంటూ లోపలికి వెళ్తాడు కాళీ. మిస్సమ్మ వచ్చి అడ్డుపడుతుంది. అయినా వినకుండా కాళీ లోపలికి వెళ్లబోతుంటే.. శివరామ్, నిర్మల వస్తారు.

ఏయ్‌ ఎందుకు వచ్చావు అని అడుగుతారు. నేను మీతో ఎవ్వరితో మాట్లాడను.. అమరేంద్ర గారితోనే మాట్లాడతాను అంటూ పిలుస్తుంటాడు. ఇంతలో రాథోడ్‌ కోపంగా కాళీ గల్లా పట్టుకుని బయటకు పోరా అంటాడు. కాళీ కోపంగా రాథోడ్‌ను కొట్టబోతుంటే.. అమర్‌ వచ్చి ఆపుతాడు. కాళీని కొడతాడు. కాళీ అమర్‌ చేయి పట్టుకుని నేను మీ ఎదురుగానే ఉన్నాను మీరు చంపొచ్చు అయినా ఇవాళ నేను నిజం చెప్పడానికి వచ్చాను అంటాడు.

నిజమా.. ఏంటి మామయ్యా ఆ నిజం అని అడుగ...