Hyderabad, ఫిబ్రవరి 7 -- NNS 7th February Episode: ​జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 7) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రణ్​వీర్​, మనోహరితో కలిసి కలకత్తా వెళ్తానంటుంది అంజు. మిగతా పిల్లలందరూ కలిసి అంజు బ్యాగ్​ సర్దుతారు. అమ్ము.. అంజును దగ్గరకు తీసుకుని మేము ఎవ్వరం లేకుండా అంత దూరం ఒక్కదానివే వెళ్తున్నావు.. జాగ్రత్తగా ఉంటావు కదా..? మనోహరి ఆంటీ.. రణవీర్‌ అంకుల్‌ ఉన్నారు కానీ వాళ్లు కూడా బయటి వాళ్లే కదా..? కావాలంటే హాలిడేస్‌లో తీసుకెళ్లమని డాడీకి చెప్తాను.. అయినా ఒక్కదానివే అంత దూరం ఎందుకు చెప్పు.. అంటుంది.

అంజు కూడా సాయంత్రం నుంచి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అమ్ము.. రణవీర్‌ అంకుల్‌ మనోహరి ఆంటీతో నన్ను కోల్‌కతా రమ్మన్నప్పుడు నేను ఎందుకు ఒప్పుకున్నానా.. అని కానీ ఎందుకో అమ్మూ కోల్‌కతా అంటే నాకు చిన్నప్పటి నుంచి చ...