Hyderabad, మార్చి 6 -- NNS 6th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మార్చి 6) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రణ్‌వీర్ ఇంటికి వెళ్లిన అమర్ కు కాళీ ఫోన్ దొరకడంతో మనోహరిపై అనుమానం పెరిగి మంగళను, రణ్‌వీర్ ను తన ఇంటికి పిలుస్తాడు. రణ్‌వీర్ ఇంట్లో అసలు ఏం జరిగిందో అక్కడే తేలుస్తానని అంటాడు.

రణ్‌వీర్, మంగళ ఇంటికి వచ్చిన తర్వాత అందరి ముందే మనోహరిని అమర్ నిలదీస్తాడు. అసలు రణ్‌వీర్ ఇంటికి ఎందుకు వెళ్లావ్? కాళీకి ఎందుకు ఫోన్ చేశావ్ అని అడుగుతాడు. దీంతో మనోహరి కంగారుపడుతుంది. డిన్నర్ కు బయటకు వెళ్లానని, మీరు రణ్‌వీర్ ఇంట్లో ఉన్నారని తెలిసి వచ్చానని, మీరు వెళ్లిపోయారని చెప్పడంతో వచ్చేశానని బుకాయిస్తుంది.

మరి కాళీకి ఎందుకు ఫోన్ చేశావని అడగటంతో రణ్‌వీర్ కూడా షాక్ తింటాడు. కాళీ, మంగళ తనను అప్పుడప్పుడూ డబ్బులు అడుగుతారని, ...