Hyderabad, మార్చి 5 -- NNS 5th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మార్చి 5) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి రణ్‌వీర్ ఇంటికి వెళ్లిందంటూ అనామిక ఆమెను అడ్డంగా ఇరికిస్తుంది. అయితేే అప్పుడు ఎలాగోలా బయటపడుతుంది. కానీ రణ్‌వీర్ ఇంట్లో ఏదో జరిగిందని, అదేంటో అక్కడికెళ్లే తెలుసుకోవాలంటూ అమర్.. రణ్‌వీర్ ఇంటికి వెళ్తాడు.

అంజుని చంపేస్తే తనకు పెద్ద ముప్పు తొలగిపోతుందని మనోహరి భావిస్తుంది. అంజు ఉన్న గదిలోకి వెళ్తుంది. చుట్టూ చూస్తుంది. ఆమెను చంపడానికి పక్కనే ఉన్న దిండు కనిపిస్తుంది. దాంతో ఊపిరాడకుండా చేసి చంపాలని అనుకుంటుంది. దిండును అంజు ముఖంపై పెట్టడానికి వెళ్తుంది.

ఈలోపు గదిలోకి మిస్సమ్మ వస్తుంది. దీంతో కంగారుగా అదే దిండును అంజలి తల కింద పెడుతుంది. ఇక్కడేం చేస్తున్నావని ఆమెను మిస్సమ్మ నిలదీయగా.. అంజలి దగ్గర ఎ...