Hyderabad, ఫిబ్రవరి 5 -- NNS 5th February Episode: ​ జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 5) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అంజు మెడలో ఉన్న చెయిన్ కు ఏదైనా స్పెషాలిటీ ఉందా అని అమర్​ని అడుగుతుంది మిస్సమ్మ. అదేం లేదని అమర్​ అనగానే.. నాకెందుకో ఇది మామూలు చెయిన్‌ అనిపించడం లేదు. దానికి ఏదో స్పెషాలిటీ ఉందేమో అనిపిస్తుంది అంటుంది. అమర్‌ షాక్‌ అవుతాడు.

సోఫా పక్కనే దాక్కున్న ఆరు.. మిస్సమ్మ తెలిసి అడుగుతుందా..? తెలుసుకోవడానికి అడుగుతుందా..? అని అనుకుంటుంది. ఇంతలో అమర్‌ దానికి అంత స్పెషాలిటీ ఏమీ లేదని.. ఆరు కొన్నది అని చెప్తాడు. అంజు కూడా మిస్సమ్మ ఇది ది గ్రేట్‌ అంజు మెడలో ఉంది. అందుకే ఈ చెయిన్‌కు అంత స్పెషాలిటీ ఉంది అని చెప్తుంది. ఇంతలో మనోహరి, రణవీర్‌ వస్తారు.

కారు దిగగానే.. రణవీర్‌ ప్లాన్‌ చేంజ్‌ చేస్తున్నాను మనోహరి అన...