Hyderabad, మార్చి 4 -- NNS 4th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మార్చి 4) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్ వాళ్లు రణ్‌వీర్ ఇంటికి వెళ్లారని తెలుసుకొని కంగారుగా అక్కడికి బయలుదేరుతుంది మనోహరి. అంజు నిద్రపోవడంతో ఆమెను అక్కడే వదిలేసి అమర్ వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతారు.

రణ్‌వీర్ ఇంట్లోనే అమర్ వాళ్లు ఉన్నారని తెలుసుకొని అతని ఇంటికి వెళ్తుంది మనోహరి. అప్పటికే అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు. ఇదే సరైన సమయం అనుకొని రణ్‌వీర్ ను వెనుక నుంచి పొడవడానికి ప్రయత్నిస్తాడు కాళీ. అయితే అతని రాకను ముందే పసిగట్టిన రణ్‌వీర్.. కాళీని అడ్డుకుంటాడు.

దీంతో ఇద్దరి మధ్య కాస్త తోపులాట జరుగుతుంది. ఈలోపు అక్కడికి వస్తుంది మనోహరి. దూరంగా పడి ఉన్న కత్తిని ఆమె చూస్తుంది. రణ్‌వీర్ ను చంపడానికి ఇదే సరైన సమయం అనుకుంటూ అ...