Hyderabad, ఫిబ్రవరి 4 -- NNS 4th February Episode: ​జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 4) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అంజును తీసుకెళ్లేందుకు మనోహరి, రణ్​వీర్​ ప్లాన్​ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడకు వచ్చిన మిస్సమ్మ వాళ్లు మాట్లాడుకునేది వింటుంది. మిస్సమ్మను చూసి రణవీర్‌, మనోహరి షాక్‌ అవుతారు.

ఎందుకు అంత షాక్‌ అవుతున్నారు అంటుంది మిస్సమ్మ. మీ కళ్లల్లో ఆ భయం కనిపిస్తుంది. అసలు ఏం చేస్తున్నారు. ఏం చేద్దామనుకుంటున్నారు. మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా లేదా అన్నది నాకు అనవసరం. కానీ మీరు నా కుటుంబం జోలికి వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది మిస్సమ్మ.

దీంతో మనోహరి ఏయ్‌ నీకేమైనా పిచ్చి పట్టిందా..? ఏదేదో మాట్లాడుతున్నావేంటి..? ఈయనేదో అడిగితే చెప్తున్నాను. దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు అంట...