Hyderabad, మార్చి 3 -- NNS 3rd March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మార్చి 3) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్, భాగీ, పిల్లలు కలిసి రణ్‌వీర్ ఇంటికి భోజనానికి వెళ్తారు. అయితే అదే సమయంలో రణ్‌వీర్ ను చంపడానికి కాళీ అతని ఇంటికి వస్తాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి.

రణ్‌వీర్ ను చంపడానికి మరోసారి అతని ఇంటికి వెళ్తాడు కాళీ. అయితే ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉండటం చూసి భయంతో మనోహరికి ఫోన్ చేస్తాడు. అక్కడి పరిస్థితిని అతడు వివరిస్తాడు.

మొహానికి ముసుగు వేసుకొని వెళ్తే నిన్ను గుర్తుపట్టరు కదా అని మనోహరి చెబుతుంది. అయితే సరే అని అతడు గోడ దూకి ఇంటి లోపలికి వెళ్తాడు. ఈ క్రమంలో అతని ఫోన్ కిందపడిపోతుంది.

అటు ఇంటికి వెళ్లిన మనోహరికి అక్కడ అనామిక తప్ప ఎవరూ కనిపించరు. అందరూ ఎక్కడికి వెళ్లారని అడిగితే.. ఎవరో రణ్‌వీర్ ఇంటికి డ...