Hyderabad, జనవరి 28 -- NNS 28th January Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 28) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కోయదొర వేషంలో వచ్చిన చిత్రగుప్తుడు ఆరు ఆత్మని యమలోకానికి తీసుకుని వెళ్తాడు. యమలోకంలో మాయాపేటికలో జరుగబోయే విషయాలు చూస్తుంది ఆరు. గుప్త వెతుకుతూ వెళ్తాడు. మాయపేటిక చూస్తున్న ఆరును చూసి షాక్‌ అవుతాడు.

మా లోకంలో కూడా నువ్వు నీ తింగరి వేషాలు వేస్తున్నావా..? అంటూ దగ్గరకు వెళ్లగానే మాయపేటికలో మనోహరికి రణవీర్‌ వార్నింగ్‌ ఇవ్వడం, మనోహరి, అంజు దగ్గరకు వెళ్లడం చూస్తుంది ఆరు. గుప్త కోపంగా బాలిక నువ్వు మాయాపేటిక చూడటం ఇక్కడ ఎవరైనా చూస్తే మాకు నరకంలో విధించే శిక్షలు విధిస్తారు అని భయపడుతుంటే.. మనో మళ్లీ ఏదో ప్లాన్‌ చేస్తుంది గుప్త గారు అంటుంది ఆరు.

నేను ఏమీ మాట్లాడుతుంటిని.. నువ్వు ఏమీ సమాధానం ఇస్తుంటువి అంటా...