Hyderabad, ఫిబ్రవరి 27 -- NNS 27th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 27) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరికి వచ్చిన కోర్టు నోటీసులపై అమర్ కుటుంబం ఆందోళన చెందుతుంది. అయితే ఆ నోటీసులు రణ్‌వీర్ పంపిన విడాకులే అయినా మనోహరి మాత్రం అనాథాశ్రమానికి చెందినవంటూ అబద్ధమాడి తప్పించుకుంటుంది.

ఎలాగోలా అమర్ నుంచి తప్పించుకొని వచ్చిన మనోహరికి కాళీ మరోసారి ఫోన్ చేస్తాడు. అసలు రణ్‌వీర్ ఎందుకు పిలిచాడని, పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందని అడుగుతాడు.

అనుమానం వస్తేనే ఇంత పని చేశాడంటే.. నువ్వే అని తెలిస్తే ఇంకేం చేస్తాడో అని మనోహరిని భయపెడతాడు కాళీ. దీంతో అతనిపై మండిపడిన మనోహరి.. ముందు అతన్ని చంపమని కాళీకి చెబుతుంది. తాను మరో ప్లాన్ వేశానని అతడు చెబుతాడు.

అటు రణ్‌వీర్ మాత్రం తనపై జరిగిన దాడి తర్వాత మరింత అప్రమత్త...