Hyderabad, ఫిబ్రవరి 26 -- NNS 26th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 26) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరిని అమ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తాడు. తనకు బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది మనోహరి. బయటకు వచ్చిన తర్వాత అమర్ అనుమానం వ్యక్తం చేయడంతో ఆమె తన భార్య అనుకొని అలా బెదిరించి ఉంటాడని రణ్‌వీర్ అంటాడు.

ఇటు అమర్ ఇంట్లో శివరాం తనకు టాబ్లెట్లు ఇవ్వాలని కోరగా.. అనామిక అతని గదిలోకి వెళ్తుంది. టాబ్లెట్ల కోసం వెతుకుతుండగా ఆమెకు అరుంధతి గాజులు, చీర కనిపిస్తాయి. ఆమె ఆ గాజులను తాకగానే గతం గుర్తుకు వస్తుంది. మిస్సమ్మను చూడగానే తన చెల్లెలిని చూసిన అనుభూతి ఆమెకు కలుగుతుంది. ఆమె మాట్లాడుతున్నా.. అనామికలో ఎలాంటి చలనం కనిపించదు.

ఆ గాజులను పట్టుకొని ఆమె అలాగే బయటకు వెళ్లిపోతుంది. అక్కడ...