Hyderabad, ఫిబ్రవరి 24 -- NNS 24th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 24) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అనామికను ఇంట్లో నుంచి పంపించేయడానికి మనోహరి ప్లాన్ చేస్తుంది. అమర్ ను భాగీ కన్విన్స్ చేయకముందే ఆమెను దారుణంగా ఇరికిస్తుంది.

పిల్లలను సమయానికి నిద్ర లేపకపోవడంతో అమర్ చేతిలో తిట్లు తిని ఉద్యోగం కోల్పోతుంది అనామిక. అయితే ఆమెను ఇంట్లోనే ఉంచడానికి అమర్ ను కన్విన్స్ చేస్తానని మిస్సమ్మ హామీ ఇస్తుంది. అది విని మనోహరి కొత్త ప్లాన్ వేస్తుంది. అందరి ముందూ అనామికను తిట్టిన మనోహరి.. తర్వాత ఆమె గదికి వెళ్తుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న తనకు ఓ బుక్ ఇవ్వాలని అనుకుంటున్నానని, అది తన రూమ్ లో ఉందని, వెళ్లి తీసుకురావాలని చెబుతుంది.

అయితే తన గదికి బదులు అమర్ గది అడ్రెస్ చెబుతుంది. అక్కడికి సందేహంతోనే అనామిక ...