Hyderabad, ఫిబ్రవరి 19 -- NNS 19th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 19) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అరుంధతి ఆత్మ మానవ శరీరంలోకి వెళ్లిందని, ఆమె తనను వెతుక్కుంటూ వస్తుందని స్వామీజీ చెప్పిన మాటలతో మనోహరి భయంతో కుప్పకూలుతుంది. అటు గుడిలో అమర్ కుటుంబంతో పూర్తిగా కలిసిపోతుంది అనామిక.

ఇంట్లో అరుంధతి ఆత్మ ఉందో లేదో తెలుసుకోవడానికి స్వామీజీని రప్పించిన మనోహరికి నమ్మలేని నిజం తెలుస్తుంది. అరుంధతి ఆత్మ అప్పటికే మానవ శరీరంలోకి వెళ్లిపోయిందని, తనను వెతుక్కుంటూ ఆమె వస్తోందని, ఆమెకు దారి ఇవ్వడం తప్ప ఇప్పుడేమీ చేసేది లేదని మనోహరికి చెబుతాడు.

ఆమెకు సంబంధించిన వస్తువులు ఏవి ముట్టుకున్నా ఆమెకు గతం గుర్తుకు వస్తుందని, ముఖ్యంగా ఆమె తాళిని ముట్టుకోకుండా చూసుకోవాలని చెప్పి వెళ్లిపోతాడు స్వామీజీ. అది విని మనోహ...