Hyderabad, ఫిబ్రవరి 18 -- NNS 18th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 18) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్ ఇంట్లో పిల్లల కేర్ టేకర్ ఇంటర్వ్యూ కోసం వస్తూ మధ్యలో గుడికి వెళ్తుంది అనామిక. అక్కడ అమర్ కుటుంబం ఆమెను కలుస్తుంది. ఇటు అరుంధతి కనిపించకపోవడంతో ఆమె ఎక్కడికెళ్లిందో తెలుసుకోవడానికి మనోహరి ప్రయత్నాలు మొదలుపెడుతుంది.

అరుంధతి ఆత్మ జాడ కనుక్కోవడానికి బాబ్జీ ద్వారా ఓ స్వామీజీని ఇంటికి రప్పిస్తుంది మనోహరి. అమర్, మిగిలిన కుటుంబ సభ్యులు గుడికి వెళ్లిన సమయంలోనే ఓ స్వామీజీని ఇంటికి తీసుకొస్తాడు బాబ్జీ. ఇంట్లోకి రాగానే ఆయన చుట్టూ బాగా పరిశీలిస్తాడు.

మనోహరి వెంటనే అరుంధతి ఫొటోను తీసుకొచ్చి స్వామీజీకి చూపిస్తుంది. ఆయన తన మంత్ర శక్తితో అరుంధతి ఆత్మ అనామికలోకి వెళ్లినట్లు గుర్తిస్తాడు. అదే విషయాన్ని మ...