Hyderabad, ఫిబ్రవరి 17 -- NNS 17th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 17) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్ ఇంట్లో పిల్లల కేర్ టేకర్ కావాలని పేపర్లో యాడ్ చూసిన అనామిక ఇంటర్వ్యూ కోసం బయలుదేరుతుంది. గతం మరిచిపోయిన ఆమెలోని అరుంధతి.. ఇప్పుడు తన పిల్లలను చూసుకోవడానికే తన ఇంటికే వెళ్లబోతడం ఆసక్తి రేపుతోంది.

శివరాత్రి సందర్భంగా గుడికి వెళ్తారు అమర్ కుటుంబ సభ్యులు. అమర్ తనతో ప్రేమగా మాట్లాడాడని, తన బాగోగులు చూసుకుంటున్నాడన్న సంతోషంలో ఉన్న భాగీ.. అమర్ ను ఫాలో అవుతూ మురిసిపోతూ గుడికి వెళ్తుంది. అయితే అక్కడ అప్పటికే శివరాం, నిర్మల ఉంటారు. గుడిలో అర్చన మొదలుపెట్టే ముందు కాసేపు ఆగాలని వాళ్లు అంటారు.

ఇంకా ఎందుకు ఆగడం అని అమర్, భాగీ అడుగుతారు. అయితే అనామిక వస్తుందని, ఆమె కోసం ఆగాలని వాళ్లు చెబుతారు. అది వ...