Hyderabad, ఫిబ్రవరి 15 -- NNS 15th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం శనివారం (ఫిబ్రవరి 15) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి పెళ్లి విషయం ఎత్తిన భాగీ ఆమెను అమర్ ముందు అడ్డంగా బుక్ చేస్తుంది. మనోహరి పెళ్లి మాట ఎత్తగానే కాళీ సిగ్గుపడటం చూసి భాగీ, పిల్లలు ఆశ్చర్యపోతారు.

తన పెళ్లి సంగతి ఇప్పుడు ఎందుకు అని, ఈ ఇంట్లో అందరూ ఉన్నారు కదా అని మనోహరి అంటుంది. కానీ అమర్ కూడా మనోహరి పెళ్లి బాధ్యత గుర్తు చేసిన భాగీకి థ్యాంక్స్ చెబుతాడు. ఇలాగే నువ్వు ఇంట్లో ఉంటే అందరూ ఏదో అనుకుంటారని, నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత తనదని మనోహరితో అమర్ అంటాడు.

అందరూ కలిసి తనను ఇలా బుక్ చేసారేంటని మనోహరి మనసులో అనుకుంటుంది. అదే సమయంలో పక్కనే ఉన్న రాథోడ్.. కాళీ, మనోహరి గారి పెళ్లి ఒకేసారి జరుగుతుందేమో అని అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అటు ఇం...