Hyderabad, ఫిబ్రవరి 14 -- NNS 14th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 14) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి.. రణ్‌వీర్ నే కలవడానికి వెళ్లినట్లు భాగీ అనుమానం వ్యక్తం చేస్తుంది. నిజం తెలిసినట్లు మాట్లాడటంతో మనోహరి భయపడుతూ తడబడుతూ బుకాయిస్తుంది. ఏదో ఊరికే అలా అన్నానని అలా అనడంతో మనోహరి ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

చనిపోబోతున్న అనామిక అనే అమ్మాయి శరీరంలోకి అరుంధతి ఆత్మను ప్రవేశ పెట్టిన చిత్రగుప్తుడు తాను ఎంత పెద్ద తప్పిదం చేశానో తెలుసుకుంటాడు. యమపురికి వెళ్లి అసలు తప్పిదం ఎలా జరిగిందో చూస్తాడు. పరకాయ ప్రవేశ సమయంలో శరీరం పూర్తిగా ఊపిరి పీల్చుకోవడం ఆగకపోతే ఆ ఆత్మ గతం మరిచిపోతుందని తెలుసుకుంటాడు.

తిరిగి భూలోకంలోకి వచ్చి అనామికలో తాను తెచ్చిన ఆత్మ ఉందని, తిరిగి ఇవ్వాలని అంటాడు. కా...