Hyderabad, మార్చి 12 -- NNS 12th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మార్చి 12) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆర్జే రేణుకను కలవడానికి ఎఫ్ఎం రేడియోకి వెళ్లిన భాగీని.. ఆమె మాజీ మేనేజర్ మరోసారి అవమానిస్తాడు. అమర్ గురించి దారుణంగా మాట్లాడుతూ.. తన దగ్గరికి రావాలని అనడంతో భాగీ అతని చెంప పగలగొడుతుంది.

కాళీని చంపడానికి హాస్పిటల్ కు వెళ్తుంది మనోహరి. అక్కడ పోలీసులు ఉండటంతో ఆమె భయపడుతుంది. అప్పుడే మంగళ లోపల నుంచి రావడం చూస్తుంది. ఆమెను చూసిన మరింత కంగారుపడుతున్న మనోహరిని మంగళ కూడా చూస్తుంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి నిలదీస్తుంది. కాళీని పొడిచింది నువ్వే కదా అని అడుతుంది.

తాను రణ్‌వీర్ ను చంపడానికి అలా చేసినా.. పొరపాటున కాళీ అడ్డొచ్చాడని చెబుతుంది. అయినా మంగళ మాత్రం ఆమెను నమ్మదు. కాళీకి స్పృహ వచ్చిన తర్వాత ఫోన్ చ...