Hyderabad, ఫిబ్రవరి 12 -- NNS 12th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 12) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రాథోడ్ మాటలతో అమర్ లోనూ మనోహరిపై అనుమానం పెరుగుతుంది. దీంతో ఆమె సంగతేంటో తేల్చుకోవడానికి అమర్ సిద్ధమవుతాడు.

అమర్, రాథోడ్ కార్లో వెళ్తుండగా మనోహరి తన కారులో వేగంగా వెళ్తూ అడ్డంగా వస్తుంది. వాళ్లను గమనించకుండా ఆమె వెళ్లిపోగా.. అమర్ మాత్రం అది మనోహరి కారు అని గుర్తించి ఆమెను ఫాలో చేయమని చెబుతాడు. రాథోడ్ ఆమెను ఫాలో చేస్తాడు. మనోహరి నేరుగా రణ్‌వీర్ ఉన్న చోటుకు వెళ్తుంది. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందనుకుంటూ ఉండగా.. లోనికి వెళ్తే మనోహరి భాగోతం మొత్తం బయటపడుతందని రాథోడ్ అంటాడు.

మనోహరిని ఫాలో అయిన విషయాన్ని అటు భాగీకి కూడా రాథోడ్ ఫోన్ చేసి చెబుతాడు. దీంతో వెంటనే లోనికి వెళ్లి ఆమెను రెడ్ హ్యాండెెడ్ గ...