Hyderabad, ఫిబ్రవరి 11 -- NNS 11th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసంలో ఈరోజు (ఫిబ్రవరి 11) ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఓవైపు కాళీ, మంగళ.. మరోవైపు రణ్‌వీర్.. ఇంకోవైపు భాగీ.. మరోహరిని టార్గెట్ చేస్తారు. దీంతో మనోహరి ఎటూ పాలుపోని పరిస్థితిలో పడిపోతుంది.

కాళీ జైలు నుంచి వచ్చేశాడని, మీరు చెప్పిన చోటు వేచి చూస్తున్నాడని మనోహరికి ఫోన్ చేసి చెబుతుంది మంగళ. వస్తున్నాను అక్కడే ఉండమని చెప్పి విసుగ్గా ఫోన్ కట్ చేస్తుంది మనోహరి. వెంటనే మరోసారి ఫోన్ రావడంతో మళ్లీ మంగళే చేసిందని మనోహరి మరింత విసుక్కుంటూ.. వస్తానని చెప్పాను కదా మళ్లీ మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తున్నావని గట్టిగా నిలదీస్తుంది.

అయితే ఆ ఫోన్ వచ్చింది రణ్‌వీర్ నుంచి కావడంతో ఆమె షాక్ తింటుంది. అరగంటలోపు తన దగ్గరికి వచ్చిన నువ్...