Hyderabad, మార్చి 10 -- NNS 10th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మార్చి 10) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తాను గతంలో పని చేసిన ఎఫ్ఎం రేడియో ఫ్రెండ్ కరుణను కలవడానికి కారులో అమర్ తో కలిసి వెళ్తుంది భాగీ. వాళ్లిద్దరిని మాత్రమే పంపించడానికి రాథోడ్ తనకు కడుపు నొప్పి అని నాటకమాడతాడు.

అమర్ ఇంట్లో ఉన్న అనామికలోని అరుంధతికి గతం గుర్తుకు తీసుకొచ్చి తన వెంట తీసుకెళ్లాలని అనుకుంటాడు విచిత్రగుప్తుడు. అమర్, భాగీ వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి చిలుక రూపంలోకి మారిపోతాడు. అనామిక అంటూ ఆ చిలుక పిలవడంతో ఆమె ఆశ్చర్యపోతుంది. తర్వాత తనను తాను పరిచయం చేసుకుంటుంది. తనతో ఓ ఆట ఆడాలని అనామికను అడుగుతుంది.

అలా అక్కడక్కడా వాలి తనను పట్టుకోవాలని చెబుతుంది. అలా చేయడం వల్ల ఇంట్లోని అరుంధతి వస్తువులను తాకి ఆమెకు గతం గుర్తుకు తీసుక...