భారతదేశం, జనవరి 27 -- తెలంగాణ ప్రాంతంలో 1980-90 మధ్య నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా ఎక్కువ. ఆ సమయంలో ఎందరో విప్లవ సాహిత్యానికి ఆకర్షితులై.. కుటుంబాన్ని, భవిష్యత్తును వదిలి అడవుల బాట పట్టారు. విద్యావంతులు కూడా నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. దీంతో వారి బలం పెరిగి, చాలా ప్రాంతాలపై పట్టు ఉండేది. ఆ ప్రాంతాలకు వెళ్లాలంటే పోలీసులు భయపడేవారు.

కానీ క్రమంగా రాజ్యం బలపడుతూ వచ్చింది. దట్టమైన అడవులపైనా పట్టు సాధిస్తూ వస్తోంది. అటు అడవి ప్రాంత గ్రామాల యువత నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అవగాహన కల్పించాయి. అదే సమయంలో నక్సలైట్ల ఏరివేతను ముమ్మరం చేశాయి. దీంతో పరిస్థితులు మారాయి. ఒకప్పుడు నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న గ్రామాలు.. ఇప్పుడు జవాన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అందుకు మంచి ఉదా...