భారతదేశం, మార్చి 26 -- నితీశ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ ఈ పేరు. గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అదరగొట్టిన ఈ వైజాగ్ కుర్రాడు.. ఆ తర్వాత టీమిండియా తరపునా సత్తాచాటాడు. ఇప్పుడు నితీశ్ తో సెల్ఫీ కోసం ఫ్యాన్స్ పోటీపడుతున్నారు. కానీ ఒకప్పుడు విరాట్ కోహ్లీతో ఫొటో కోసం నితీశ్ కుమార్ తిప్పలు పడ్డాడు. ఆ సమయంలో విరాట్ భార్య అనుష్క శర్మ.. నితీశ్ కలను నిజం చేసింది.

కొన్ని సంవత్సరాల క్రితం నమన్ అండర్-16 అవార్డుల ప్రోగ్రామ్ లో కోహ్లీతో సెల్ఫీ కోసం నితీశ్ ట్రై చేశాడు. కానీ సెక్యూరిటీ కారణంగా కోహ్లీ దగ్గరకు వెళ్లలేకపోయాడు. ఈ విషయాన్ని తాజాగా పూమా యూట్యూబ్ ఛానెల్‌లో నితీశ్ వెల్లడించాడు.

"నాకప్పుడు 16 ఏళ్లు. విరాట్ కోహ్లీతో ఫొటో కోసం ట్రై చేశా. ఆయన నా వెనుకే కూర్చున్నారు. అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. మా అమ్మ ఫోన్ తీసుకున్నా. ...