భారతదేశం, ఫిబ్రవరి 26 -- Nithin Kamath health : ఎల్లప్పుడు ఫిట్​గా ఉంటూ, ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ స్టాక్​ బ్రోకరేజ్​ సంస్థ జెరోధా కో-ఫౌండర్​, సీఈఓ నితిన్​ కామత్​ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆరు వారాల క్రితం.. మైల్డ్​ స్ట్రోక్​తో ఆరోగ్యం దెబ్బతినట్టు వివరించారు.

"ఆరు వారాల క్రితం.. అనూహ్యంగా నాకు స్వల్ప గుండెపోటు వచ్చింది. తండ్రి మరణించడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, అలసిపోవడం, డీహైడ్రేషన్​, ఎక్కువగా వర్కౌట్స్​ చేయడం.. వీటిల్లో ఏదో ఒకటి కారణం అవ్వొచ్చు," అని సోమవారం.. ఓ ట్వీట్​ చేశారు 44ఏళ్ల నితిన్​ కామత్​.

తన ముఖం పొడిబారినట్టు, అప్పటి నుంచి చదవడం- రాయడం కష్టంగా ఉన్నట్టు వెల్లడించారు జెరోధా కో-ఫౌండర్​ నితిన్​ కామత్​. పూర్తిగా రికవర్​ అవ్వడానికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలిపారు....