Hyderabad, మార్చి 5 -- Nithin About Divyabharathi In Kingston Pre Release Event: కోలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా, నటుడిగా రాణిస్తున్న యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా కింగ్‌స్టన్ సినిమాతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఫస్ట్ సీ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీగా రూపొందిన కింగ్‌స్టన్ మూవీలో 'బ్యాచిలర్' తరువాత మరోసారి దివ్యభారతి, జీవీ ప్రకాష్ జంటగా కనిపించనున్నారు. కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళలో మార్చి 7న విడుదల కానున్న కింగ్‌స్టన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా ఘనంగా జరిగింది.

హైదరాబాద్‌లో మార్చి 4న రాత్రి జరిగిన కింగ్‌స్టన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో నితిన్, డైరెక్టర్స్ వెంకీ కు...