భారతదేశం, మార్చి 8 -- నీతా అంబానీ గురించి తెలియని వారుండరు. క్రీడా మైదానంలో, రిలయన్స్ ఈవెంట్లలో చాలా చురుగ్గా పాల్గొంటూ, ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. 61ఏళ్ల వయస్సులోనూ అమితమైన ఉత్సాహంగా వ్యవహరించే నీతా అంబానీ తన ఫిట్‌నెస్ వెనకున్న సీక్రెట్ ఏంటో బయటపెట్టారు. పైగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూనే ప్రతి ఒక్క మహిళా తమ కోసం ఏదో ఒకటి చేయాలనే ప్రేరణాత్మకమైన వీడియో రిలీజ్ చేశారు.

"ప్రతి ఒక్క మహిళ తమ కోసం తాము ఏం చేసుకున్నారో అసలు గుర్తుందా? ఎప్పుడూ ఫ్యామిలీ, బంధువుల గురించి మాత్రమే ఆలోచిస్తూ, మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను చివరి స్థానానికి నెట్టేశారు కదా. అలా చేస్తూపోతే, మిమ్మల్ని మీరే పట్టించుకోకపోతే ఇక మీ గురించి ఆలోచించేది ఎవరు. 50 లేదా 60 ఏళ్లు దాటి ఉంటే, మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. "

"30 ...