భారతదేశం, మార్చి 21 -- NIT Silchar: అసోంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) సిల్చార్ లో ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పై సస్పెన్షన్ వేటు పడింది. తక్కువ మార్కులు రావడంపై చర్చించేందుకు గురువారం తన చాంబర్ కు పిలిపించుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.కోటేశ్వరరాజు తనను అనుచితంగా తాకాడని విద్యార్థిని ఆ నోట్ లో పేర్కొంది. 'నా స్కోర్లకు కారణాన్ని వివరించమని అతను నన్ను అడిగాడు. అకస్మాత్తుగా నన్ను తాకడం ప్రారంభించాడు. సౌకర్యవంతంగా ఉండమని కోరాడు. నేను అతని మాట వింటే నా మార్కులను తాను చూసుకుంటానని చెప్పాడు" అని ఆమె చేతిరాతతో రాసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సిల్చార్ నిట్ లో లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి సోషల్ మీడియా పోస్టుపై స్పందించిన అస్సాం పోలీసులు వెంటనే చర...