భారతదేశం, ఏప్రిల్ 10 -- మీరు విలాసవంతమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనాలని ఆలోచిస్తుంటే.. ఈ ఏప్రిల్ మీకు జాక్‌పాట్ కొట్టే ఛాన్స్ ఇస్తుంది. ఎందుకంటే నిస్సాన్ ఇండియా ఈ నెలలో హ్యాట్రిక్ కార్నివాల్‌ను తన కస్టమర్లకు తీసుకువచ్చింది. దీనిలో మీరు భారీగా డిస్కౌంట్ పొందవచ్చు. ఆ వివరాలేంటో చూద్దాం..

2025 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30, 2025 వరకు జరిగే ఈ ఆఫర్ ఫెస్ట్‌లో నిస్సాన్ మాగ్నైట్‌పై డీల్స్ ఉంటాయి. ఇందులో రూ .55,000 వరకు ప్రయోజనం ఉంటుంది. దీంతోపాటు అదనంగా రూ.10,000 నగదు లభిస్తుంది. ప్రతి కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఉచిత బంగారు నాణెంతో వస్తుంది. ఇది లక్కీ డ్రా కాదు, కానీ ప్రతి కస్టమర్‌కు బంగారు నాణెం లభిస్తుంది.

ఈసారి నిస్సాన్ ఆఫర్లు తీసుకురావడమే కాకుండా పూర్తి స్థాయి క్రికెట్ వాతావరణాన్ని కూడా తీసుకువచ్చింది. షోరూంలోకి ప్రవేశించగానే క్రికెట్ థీమ్ అలంకరణ, మి...