భారతదేశం, ఫిబ్రవరి 3 -- భారత కార్ల మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు నిస్సాన్ భారీగా ప్రణాళికలు వేస్తోంది. తన పోర్ట్‌ఫోలియోను విస్తరించనుంది. ఇందులో హైబ్రిడ్, సీఎన్జీ వంటి కొత్త కార్లు ఉంటాయి. అంతేకాకుండా నిస్సాన్ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయనుంది.

ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్, ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీలను భారతదేశంలో విక్రయిస్తోంది. అయితే త్వరలో కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ మాగ్నైట్ హైబ్రిడ్, సీఎన్జీ వేరియంట్లను విడుదల చేయవచ్చు. అయితే కంపెనీ ఈ పవర్ట్రెయిన్లను మాగ్నైట్‌కు మాత్రమే తీసుకువస్తుందా లేదా కొత్త మోడళ్లకు కూడా జోడిస్తుందా అనే దాని మీద మాత్రం ఇంకా స్పష్టత లేదు.

గతంలో కంపెనీ ప్రకటించిన ప్రణాళికలన్నీ పక్కాగా ఉన్నాయని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోర్రెస...