భారతదేశం, ఫిబ్రవరి 25 -- Nirmal News : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన అడ్వకేట్ లక్కాకుల తుకారాం కుమారుడు లక్కా కుల ఆదిత్య హిమాలయ పర్వతాలలోని కేదార్ ఖండ్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఆదిత్య 12,500 అడుగుల ఎత్తున ఉన్న ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు 15 రాష్ట్రాలకు చెందిన 300 మందితో కూడిన బృందంతో బయలుదేరాడు. వీరిలో కేవలం ఏడుగురు మాత్రమే శిఖరం పైవరకు చేరుకున్నారు. ఇందులో ఆదిత్య మిగతా వారి కన్నా ముందుగా అధిరోహించి మొదటి స్థానంలో నిలిచాడు.

ఆదిత్య పంజాబ్లోని ఎల్పీయూ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్నాడు. ఆదిత్య దాదాపు 12,500 అడుగుల ఎత్తున ఉన్న సమ్మిట్ క్యాంప్ నకు చేరుకున్నాడు. విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలి మధ్యన ఐదు రాత్రులపాటు శ్రమించి లక్ష్యాన్ని చేరుకున్నట్లు తెలిపాడు. తెలంగాణ నుంచి 8 మంది వరకు లక్ష్యాన్ని చేరుకోగ...