తెలంగాణ,నిర్మల్, ఫిబ్రవరి 26 -- నిర్మల్ జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ భవనాల స్వాధీనానికి స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే. నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. భైంసా ప్రాంతంలో గడ్డెన్నవాగు, శ్రీరాంసాగర్ జలాశయ నిర్మాణంలో భాగంగా చాలా మంది భూములు కోల్పోయారు. వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందలేదు. దీంతో పలువురు బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

కలెక్టరేట్ పరిధిలో రూ. 6.79 కోట్లు, ఆర్డీఓ కార్యాలయం పరిధిలో రూ.1.45 కోట్లు చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో ప్రతిసారి తాత్సారం జరుగుతుండటంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులను జప్తు చేయాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వు...